PNB Housing Finance Limited

ఎన్‌ఎస్‌ఇ:

బిఎస్‌ఇ:

చివరి అప్‌డేట్:

()
సగటు రేటింగ్
షేర్ చేయండి
కాపీ చేయండి

ఫ్రాంకింగ్ మరియు స్టాంపింగ్ - తేడా ఏమిటి?

give your alt text here

మీ స్వంత డబ్బుతో లేదా హోమ్ లోన్ సహాయంతో మీరు ఏ రకమైన ఇంటిని కొనుగోలు చేసినా నిర్ధిష్ట ఫీజులు మరియు పన్నులు చెల్లించాలి. ఉదాహరణకు, లోన్ ప్రాసెసింగ్ ఫీజు లేదా రుణదాత ద్వారా ఆస్తి యొక్క సాంకేతిక మదింపు కోసం ఖర్చులు లాంటివి ఉంటాయి.

అలాగే, ఇంటి కొనుగోలుకు సంబంధించిన అలాంటి ఫీజులు, పన్నుల ఇతర ఉదాహరణలలో ఫ్రాంకింగ్ లేదా స్టాంపింగ్‌ చార్జీలు ఉంటాయి. రెండూ ఒకేలా ఉన్నాయా? లేదు, అలాంటిదేమి జరగదు. అది కేవలం ఒక అపోహ మాత్రమే.

ఒక ఇంటి కొనుగోలుదారుగా మీరు రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. ఇది మీ డాక్యుమెంట్లు మరియు చెల్లింపులను సరిగ్గా నిర్వహించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ బ్లాగ్‌లో ఫ్రాంకింగ్ మరియు స్టాంపింగ్ మధ్యగల ప్రధాన వ్యత్యాసాలను మేము మీకు తెలియజేస్తాము.

ఫ్రాంకింగ్ లేదా స్టాంపింగ్ - ఇవి రెండూ ఒకటేనా?

స్టాంపింగ్ మరియు ఫ్రాంకింగ్ మధ్య గల ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, స్టాంపింగ్ అనేది మీ ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైనవి అని రుజువు చేసే సుంకం చెల్లింపు, అయితే, ఫ్రాంకింగ్ అనేది స్టాంపింగ్‌కు సంబంధించిన ఏదైనా సుంకాన్ని ఇంటి కొనుగోలుదారు చెల్లించినట్లు సూచించే ఒక రుజువు.

స్టాంపింగ్ అంటే ఏమిటి?

స్టాంపింగ్ అనేది ఒక ఇంటి కొనుగోలు సమయంలో మీ ఆస్తి డాక్యుమెంట్లను ఆమోదించడానికి ప్రభుత్వానికి పన్ను చెల్లించే చర్యను సూచిస్తుంది. సాధారణంగా ఈ డాక్యుమెంట్లలో సేల్ డీడ్, తనఖా పేపర్లు లేదా సంపద లేదా ఆస్తుల బదిలీ ఉంటాయి. స్టాంపింగ్ ప్రక్రియలో భాగంగా, మీ ఆస్తి కొనుగోలును చట్టపరమైనదిగా చేయడానికి మీరు స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించాలి. మీరు అలా చేసిన వెంటనే, మీ సేల్ అగ్రిమెంట్ పై మీరు ఒక స్టాంప్ పొందుతారు. స్టాంప్ చేయబడిన ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైనవి.

  • ఫీజు స్వభావం
    • స్టాంప్ డ్యూటీ అనేది మీ ఆస్తి డాక్యుమెంట్లను చట్టబద్ధం చేయడానికి చెల్లించబడే పన్ను. మీ ఆస్తి డాక్యుమెంట్లు చట్టపరమైనవి అని ఇవి నిర్ధారిస్తాయి.
  • ఫీజు మొత్తం
    • స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేవి మీ ఆస్తి మొత్తం విలువపై లెక్కించబడతాయి. సాధారణంగా, స్టాంప్ డ్యూటీ అనేది ఆస్తి విలువలో 3-10% మధ్య ఉంటుంది. ఇది లావాదేవీ జరిగిన రాష్ట్రం, ఆస్తి స్థితి, ఇంటి కొనుగోలుదారు వయస్సు మరియు లింగం మొదలైనటువంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
    • ఉదాహరణకు, ముంబైలో స్టాంప్ డ్యూటీ ఛార్జీలు సాధారణంగా ఆస్తి మొత్తం ఖర్చులో 5% ఉంటాయి. అయితే, ఢిల్లీలో ఒక పురుషుడు ఆస్తిని కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీ సుమారు 6% ఉంటుంది. ఒక ఒక మహిళ ఢిల్లీలో ఆస్తిని కొనుగోలు చేస్తే, అప్పుడు స్టాంప్ డ్యూటీ సుమారు 4% ఉంటుంది.
    • ఆస్తి కోసం రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం ఆస్తి విలువలో సుమారు 1% ఉంటుంది. అదనంగా, ₹100 కూడా పేస్టింగ్ ఛార్జీలుగా చెల్లించబడతాయి.
  • ఛార్జీని ఎవరు ప్రమాణీకరిస్తారు?
    • స్టాంప్ డ్యూటీ చెల్లించడానికి, మీరు మీ నివాస పరిధిలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించాలి. మీరు మీ స్టేట్ పోర్టల్‌లో దీనిని ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

స్టాంపింగ్ పలు మార్గాలలో పూర్తి చేయబడుతుంది. వీటిలో కాగిత ప్రక్రియ, ఇ-స్టాంపింగ్ లేదా ఫ్రాంకింగ్ ఉన్నాయి.

  • కాగిత-ఆధారిత ప్రక్రియ అనేది స్టాంపింగ్ యొక్క అత్యంత సాంప్రదాయక పద్దతి. ఈ పద్ధతిలో మీరు ఏదైనా అధికారిక విక్రేత నుండి స్టాంప్ పేపర్‌ను కొనుగోలు చేయవచ్చు మరియు మీ సేల్ అగ్రిమెంట్‌ ప్రింట్ చేయడానికి దానిని ఉపయోగించవచ్చు.
  • ఇ-స్టాంపింగ్ అనేది నాన్-జుడీషియల్ స్టాంప్ డ్యూటీని చెల్లించడానికి ఉన్న ఒక సురక్షితమైన, ఎలక్ట్రానిక్ మార్గం. మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా ఆన్‌లైన్‌లో మీరు ఇ-స్టాంపింగ్ చేయవచ్చు. ఇది స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఆమోదించబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది మరియు నెమ్మదిగా సాగే సాంప్రదాయక కాగితం ఆధారిత పద్ధతితో పోలిస్తే కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
  • స్టాంపింగ్ పూర్తి చేయడానికి ఉన్న మూడవ ప్రక్రియ ఫ్రాంకింగ్, దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తప్పక చదవండి: మీ హోమ్ లోన్ అర్హతను ఎలా మెరుగుపరచుకోవాలి?

ఫ్రాంకింగ్ అంటే ఏమిటి?

ఫ్రాంకింగ్ అనేది చట్టపరమైన ఆస్తి పత్రాలను స్టాంపింగ్ చేసే ప్రక్రియను సూచిస్తుంది. మీ డాక్యుమెంట్లను స్టాంప్ చేసే లేదా వాటికి ఒక డినామినేషన్ జోడించగలిగే అధీకృత బ్యాంకుల ద్వారా ఫ్రాంకింగ్ చేయబడుతుంది. ఫ్రాంకింగ్ సాధారణంగా ఫ్రాంకింగ్ మెషీన్ ఉపయోగించి నిర్వహించబడుతుంది. అటువంటి మెషిన్-మేడ్ స్టాంప్ అనేది మీరు మీ స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు రుజువు.

స్టాంప్ డ్యూటీ చెల్లించబడిందని సూచించే మీ డాక్యుమెంట్లను బ్యాంక్ గుర్తించిన తర్వాత, మీరు వాటిపై సంతకం చేయాలి. ఫ్రాంకింగ్‌కు ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే ఇప్పటికే ఫ్రాంక్ చేయబడిన ప్రింటెడ్ స్టాంప్ పేపర్లను కొనుగోలు చేయడం.

  • ఫీజు స్వభావం
    • ఫ్రాంకింగ్ ఛార్జ్ అనేది మీ ఆస్తి డాక్యుమెంట్ల స్టాంపింగ్ పూర్తి చేయడానికి చెల్లించబడే ఫీజు. ఇది మీ స్టాంప్ డ్యూటీ చెల్లించబడిందని నిర్ధారిస్తుంది.
  • ఫీజు మొత్తం
    • ఫ్రాంకింగ్ ఫీజు అనేది సాధారణంగా ఆస్తి విలువలో దాదాపు 0.1% లేదా హోమ్ లోన్ విలువలో 0.1-0.2% గా ఉంటుంది. ఇది రాష్ట్రం నుండి రాష్ట్రానికి కూడా మారుతుంది. అనేక సందర్భాల్లో ఇది ఉచితంగా కూడా చేయబడుతుంది. బదులుగా, స్టాంప్ డ్యూటీలోనే ఫ్రాంకింగ్ ఛార్జీని కూడా చేర్చే అవకాశం మీకు ఉంటుంది.
  • ఛార్జీని ఎవరు ప్రమాణీకరిస్తారు?
    • అధీకృత బ్యాంకులు లేదా ప్రభుత్వ అధీకృత ఏజెంట్లు మాత్రమే అధికారిక ఫ్రాంకింగ్‌ను నిర్వహించగలరు.
    • ఏదైనా పని రోజున ఒక బ్యాంకులో పరిమిత సంఖ్యలో కొన్ని గంటలు మాత్రమే ఫ్రాంకింగ్ చేయబడుతుంది, కాబట్టి తదనుగుణంగా మీ బ్యాంక్ సందర్శనను ప్లాన్ చేసుకోండి.

ముగింపు

ఒక ఆస్తి కొనుగోలుదారుగా, మీకు ఫ్రాంకింగ్ లేదా స్టాంపింగ్ మధ్య ఎంచుకునే ఎంపిక ఉంటుంది. అదనపు విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • మీరు హోమ్ లోన్ కోసం అప్లై చేస్తున్నట్లయితే, మీ రాష్ట్రం మరియు రుణదాత ఆధారంగా హోమ్ లోన్, ఫ్రాంకింగ్ ఛార్జీలు, హౌస్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మొదలైన వాటిపై స్టాంప్ డ్యూటీని చెక్ చేయండి. ఇది అవసరమైన నిధులను ఆదా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • మీరు ఫ్రాంకింగ్ ఎంచుకున్నట్లయితే, అవాంతరాలను నివారించడానికి నిర్దిష్ట సమయంలో పూర్తి అవ్వవలసిన అన్ని ఫార్మాలిటీల కోసం ముందుగానే సిద్ధం అవ్వండి.

మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నేడే పిఎన్‌బి హౌసింగ్ నిపుణులను సంప్రదించండి.

అవాంతరాలు లేకుండా కేవలం
3 నిమిషాలు, అవాంతరాలు-లేని!

పిఎన్‌బి హౌసింగ్

ఇతర ముఖ్యమైన అంశాలు

Request Call Back at PNB Housing
కాల్ బ్యాక్